Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

డా.జిత్. కే అగ్గర్వాల్ యొక్క మాటల్లో

Vol 3 సంచిక 6
November/December 2012


ప్రియమైన అభ్యాసకులకు

            స్వామి యొక్క 87వ జన్మదిన వేడుకలు ఎంతో వైభవంగా ఆహ్లదకంగా ప్రశాంతి నిలయంలో జరిగిన తరవాత, వైబ్రియోనిక్స్ నిపుణులు ఎంతో పనిగా వునప్పుటికి ప్రశాంతి రైల్వే స్టేషన్ లో నాల్గొవ సంవత్సర ఉచిత వైద్య శిబిరం పెట్టి సేవ చేశారు. ముఖ్యన్గా ఎవరైతే స్వామి యొక్క జన్మదిన వేడుకలకు రైల్ లో దూర ప్రయాణం చేసి వచ్చారో (దాదాపు వేయి మందికి) వారికీ వైద్యం అందించారు. స్వామి యొక్క అనుగ్రహం ప్రతి చిన్న విషయంలో కూడా ఉంటుంది. ఆ సమయంలో రోగులు ఎక్కువ మంది వచ్చారు అప్పుడు మందు సీసాలు అయిపోయినై  కొన్ని సెకండ్లలోనే ఒక సాధకుడు వచ్చి మందు సీసాలు తెచ్చి ఇచ్చారు,  ఆ తరవాత వైద్య శిబిరం ఎంతో శక్తివంతంగా జరిగింది. ఆ సమయంలో ఇలాంటి అద్భుతాలు ఎన్నో జరిగాయి . ఒకొక్క సమయంలో ఒక సాధకునికి కాలు కాలింది అప్పుడు అతను ఆ సమయం లో వారం రోజులు విశ్రాంతి తీసుకోవాలి కానీ, అతను ప్రతి గంటకు శక్తివంతమైన వైబ్రియోనిక్స్ మందు తీసుకున్నారు. స్వామి యొక్క అపారమైన ప్రేమ వల్ల ఆ సాధకుడు లేచి నొప్పి లేకుండా నడిచారు.

ఈ సంవత్సరం అక్టోబర్ లో మేము అమెరికాలో (ఫోటో చుడండి ) హార్ట్ఫోర్డ్, కనెక్టికట్లో జేవీపీ అభ్యాసకులకు వర్క్ షాప్  నిర్వహించాము. అమెరికా మరియు దక్షిణ అమెరికాలోని కొలంబియా నుంచి వచ్చిన 21 భక్తులు ఆత్మ సెంటర్ వద్ద జరిగిన రెండు రోజుల వర్క్ షాప్ కు హాజరయ్యారు మరియు విజయవంతంగా కోర్సు పూర్తి చేసారు. పూర్తి అర్హత పొందిన ఒక  విబ్రియో టీచర్ ను భవిష్యత్తులో విబ్రియో సేవ చేయడానికి ఆసక్తి చూపే సాధకులకు శిక్షణ ఇచ్చుటకు నియమించామని మీకు తెలియచేయడానికి నేను ఏంటో సంతోషించుచున్నాను. మీరు ఆ టీచర్ ను [email protected] వద్ద సంప్రదించవచ్చు.
స్వామి అనుగ్రహంతో, వైబ్రియోనిక్స్ పని విస్తరిస్తోంది మరియు స్వామి సేవ చేయడానికి కట్టుబడి ఉన్న వారందరికీ అవకాశం ఉంది. మీరు మీ దేశం కోసం ఒక సమన్వయకర్త కావడానికి ఆసక్తి లేదా ఒక టీచర్స్ శిక్షణ కోర్సు కోసం దరఖాస్తు చెయ్యాలనుకుంటే, నాకు ఒక ఇమెయిల్ పంపండి.

నవంబర్ 24న, త్రిశూర్ జిల్లా, కేరళ, భారతదేశం కు చెందిన వైబ్రియోనిక్స్ అభ్యాసకులు కమ్యూనిటీలో ఒక శాశ్వత వైబ్రియోనిక్స్ స్వస్థత శిబిరం ఆనారోగ్యమైన దీనుల కోసం  స్థాపించారు. ముఖ్యంగా ఇది ఆ గ్రామ ప్రజలకు అందునా డబ్బులేని  పేద ప్రజలకు ఒక అద్భుతమైన అవకాశం. భారతదేశం యొక్క ఇతర రాష్ట్రాలు వారి నుండి ప్రేరణ పొంది త్వరితంగా భారతదేశం లో ఇంకా ప్రపంచవ్యాప్తంగా అనేక కేంద్రాలు ఏర్పడాలని మేము ఆశిస్తున్నాము.

నవంబర్ 25న, భారతదేశం లో బెంగుళూర్ వద్ద క్యాన్సర్ కోసం ప్రత్యామ్నాయ చికిత్సలు గురించి కార్డ్ రోడ్ హాస్పిటల్లో ఒక సదస్సు నిర్వహించారు. ఆరు నిపుణులు వివిధ రకాల క్యాన్సర్ శక్తి చికిత్సలు గురించి సమాచారం ఇచ్చారు. ఆసుపత్రి నుండి వచ్చిన ముగ్గురు శస్త్ర చికిత్స నిపుణులు, శక్తి చికిత్సలు వలన లబ్ది పొందిన రోగుల అద్భుతమైన వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు. నన్ను వైబ్రియోనిక్స్ గురించి క్యాన్సర్ రోగులతో, వైద్యులతో మాట్లాడేందుకు ఆహ్వానించారు. నేను ఆరు వివిధ రకాల క్యాన్సర్ కేసులు వైబ్రియోనిక్స్ ద్వారా పూర్తిగా ఎలా నయమైనవో వివరించాను. స్వామి కృప వలన నా ఉపన్యాసాన్ని అందరు చక్కగా ఆదరించారు.

ఎప్పటికప్పుడు అభ్యాసకులు డిసెంబర్ 21, 2012 గురించి స్వామి  ఏమైనా చెప్పారా అని నన్ను అడుగుతుంటారు. బాబా దీని గురించి స్పష్టంగా చెప్పినట్లు నా దగ్గర సమాచారం లేదు. కానీ మనం మానవ చరిత్రలో ఒక ముఖ్యమైన అభివృద్ధి ప్రారంభ దశ వద్ద ఉన్నామని నిస్సందేహంగా చెప్పగలము.  ఉంది ప్రతిదీ మాకు అన్ని ఒక WAKE పిలుపు. కొంతమంది ఒక అద్భుతమైన సంఘటన విశ్వంలో 21-23 dec 12 సమయంలో 8 నిమిషాలు పాటు జరుగుతుంది అని నమ్ముతున్నారు. ఈ 8 నిమిషాల పాటు అత్యంత అధిక పౌనఃపున్యం గల శక్తి ప్రవాహం భూమి మీద ప్రసరించబడుతుంది. మరింత సమాచారం త్వరలో మా వెబ్ సైట్ లో పోస్ట్ చేయబడుతుంది, కాబట్టి www.vibrionics.org కు లాగ్ ఆన్ చేయడం మరిచిపోకండి

సాయి సేవా ప్రేమలో
జిత్ అగర్వాల్
 

PN రైల్వే స్టేషన్, పుట్టపర్తి వద్ద మెడికల్ క్యాంప్ 21-23 నవంబర్ 2012

 

 

 

 

 

 

 

                                                                                     హార్ట్ఫోర్డ్ CT USA లో JVP శిక్షణ క్లాస్ 20-21 అక్టోబర్ 2012