దివ్య వైద్యుని దివ్య వాణి
        Vol 8 సంచిక 6
        November/December 2017
      
      “పశు పక్షి మృగాదులకు  మానవుని వలె గుండెజబ్బులు,జీర్ణ సమస్యలకు గురికావు. కారణం ఏమిటంటే అవి ప్రకృతిలో సహజంగానే లభించే పదార్ధలము తీసుకొనుచుండగా మానవుడు రుచికి బానిసఅయ్యి వండిన,వేపిన పదార్ధాలు తీసుకుంటూ ఉంటాడు.ఈ నాటి మానవుడు రకరకాల కృత్రిమ పదార్ధాలు ,మత్తు పదార్ధాలు,మద్యము వంటి ఆరోగ్యానికి హాని కలిగించే పదార్ధాలు తీసుకుంటూ ఉన్నాడు. అలాగే పశుపక్షిమృగాదులు సహజమైన జీవనవిధానము అవలంభిస్తూ ఉంటె మానవుడు కృత్రిమ జీవన విధాను ద్వారా ఆరోగ్యానికి పాడుచేసుకుంటున్నాడు. ఆహారము విషయంలో మితము హితము పాటించి నపుడే మానవునికి వ్యాధులు దూరమయి చక్కని ఆరోగ్యము చేకూరుతుంది. యావత్తు సృష్టి నుండి మానవుని వేరుచేసేది అతనికి దైవము ప్రసాదించిన విచక్షణ అనే అద్బుత గుణమే. కనుక ఆహార విహరాదుల విషయంలో ఈ విచక్షణ,వివేకము ఉపయోగించి  సంపూర్ణమైన ఆరోగ్యంతో జివించ గలగాలి..”                                                                                                                                            …సత్యసాయిబాబా , “ఆహారము. గుండె మరియు మనసు ” అవతార వాణి , 21 జనవరి 1994 
http://www.sssbpt.info/ssspeaks/volume27/sss27-03.pdf
“మనిషి ఇతరుల చేత సేవింప బడే దానికన్నా ఇతరులకు సేవ చేసే టందుకు ఎప్పుడూ సంసిద్ధుడయి ఉండాలి. మనకన్నా ఉన్నత స్థితి లో ఉన్న వారిని సేవించడం చాలా ఉత్తమం. మనకు సహాయకులుగా ఉన్న వారి విసయంలో వారి సేవలను అజమాయిషీ చేయవచ్చు .కానీ మనతో సమానస్థాయిలో ఉన్న వారి విషయంలో ఇది కూడదు.అలాగే నిరుపేదలకు,నిస్సహాయులకు,ఏ విధమైన ఆసరా లేనివారికి సేవచేయడం అత్యుత్తమమైన సాధన..”
...సత్యసాయిబాబా , “సేవచేయడానికే జన్మ   ” దివ్య వాణి ,  19 సెప్టెంబర్ 1987 
http://www.sssbpt.info/ssspeaks/volume20/sss20-26.pdf
