గ్లకోమా వ్యాధి 01176...Bosnia
76 ఏళ్ల ఒక విబ్రియో అభ్యాసకురాలు రెండు సంవత్సరాల క్రితం తన యొక్క రెండు కళ్ళను పరీక్ష చేయించుకోవడానికి నేత్ర నిపుణుడి దగ్గరకు వెళ్లారు. ఎందుకనగా ఆమె యొక్క కళ్ళద్దాలు మునుపటి వలె ఆమెకు చక్కని దృష్టిని ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాయి. ఆమె కళ్ళను పరీక్ష చేసిన నేత్ర నిపుణుడు ఆమెకు ఆమె యొక్క తండ్రి వలె రెండు కళ్ళలోను సుమారు 32mm Hg ప్రెషర్ తో గ్లకోమా వ్యాధి ఉన్నట్లు చెప్పారు. అంతే కాకుండా ఎ విధమైన లెన్స్ కూడా ఆమె యొక్క కుడి కంటి దృష్టిని మెరుగు పరచలేవని, ఎందుకనగా ఆ కన్ను వైద్య పరి భాషలో “లేజీ ఐ” గా అయిందని చెప్పారు. అభ్యాసకురాలు ఇది విని చాల ఆందోళన పడ సాగారు, ఎందుకనగా ఆమె తండ్రి కూడా పెద్ద వయసులో ఇదే సమస్యతో భాదపడుతూ చివరకు తన యొక్క కంటి చూపును కోల్పోయి పూర్తిగా గుడ్డి వారైయ్యారు. ఆమెకు తన కళ్ళ యొక్క ప్రెషర్ తగ్గటానికి cosopt అనబడే కంటి చుక్కల మందు ఇవ్వబడింది. రెండు నెలల తరువాత పరీక్ష చేయగా ఆమె కంటి యొక్క ప్రెషర్ 20 mm Hg తగ్గినట్లు తెలిసింది. కానీ ఆ తరువాత ఆ మందు వలన ఆమెకు అలర్జీ వచ్చి నాలుక కూడా వాయడంతో ఆమె దానిని నిలిపేశారు. కొత్త కంటి చుక్కల మందు xalatan ఆమెకు ఇవ్వబడింది, కాని ఈ మందు వలన ఆమె కళ్ళలో చికాకు రావడంతో దానిని కూడా ఆమె మానేశారు. అభ్యాసకురాలు తనకు తానే విబ్రియో వైద్యం తీసుకోవాలని భావించి క్రింది కాంబోలను వాడారు.
NM17 Eye + NM48 Vitamin Eye Compound + NM109 Vision + BR20 Eye + SR454 Aqueous Humour + SR465 CN2: Optic…TDS
కొంత కాలం తరువాత ఆమె 108 CC బాక్సు పొందాక ఈ క్రింది కాంబోలను వాడారు:
CC7.1 Eye tonic + CC7.4 Eye defect + CC7.5 Glaucoma…TDS
విబ్రియో రేమేడీలు వాడటం మొదలుపెట్టిన తరువాత ఆమె యొక్క కంటి చూపు మెల్లగా 25% మెరుగు పడింది. అంతే కాకుండా ఆమె కళ్ళ యొక్క ప్రెషర్ కూడా 15 నుంచి 20 mmHg మధ్య సంతృప్తికరంగా ఉంటోంది. ఆమె పై రేమేడీలను తీసుకోవడం కొనసాగిస్తున్నారు.