గొంతు నొప్పి, దగ్గు మరియు సైనసిటిస్ 01176...Bosnia
75 ఏళ్ల మహిళ చాల రోజులుగా గొంతుమంట, కఫంతో కూడిన దగ్గు మరియు సైనుసైటిస్తో భాదపడుతూ సహాయం కొరకు వచ్చింది. ఆవిడకు క్రిందివి ఇవ్వబడ్డాయి
#1. NM36 War + NM70 CB9 + NM71 CCA + NM113 Inflammation…TDS
#2. SM26 Immunity + SM27 Infection + SM31 Lung & Chest + SM35 Sinus + SM40 Throat…TDS
ఒకవారం రోజుల తరువాత ఆవిడ ఆరోగ్యం 20 శాతం మెరుగైంది. అభ్యాసకుడు చాలా ప్రశ్నలు వేసాక ఆవిడ తనకు 15 ఏళ్ల వయసులో స్కేబిస్ వ్యాధి సంక్రమించినట్లు తెలిపింది. అప్పటినుంచి ఆవిడ బ్రాంకైటిస్తో భాదపడుతూ ఉంది. సంవత్సరాల తరువాత ఆవిడకు సైనస్సమస్యవలన ఇబ్బందులు ఏర్పడ్డాయి. అంతే కాక కొన్నిసంవత్సరాలుగా అల్లోపతి వైద్యులు ఇచ్చిన యాంటిబయోటిక్స్వలన చాలా ఎలర్జీ సంబంధిత సమస్యతో భాదపడ్డారు. ఆమె యొక్క దీర్ఘకాలిక సమస్యలను నయం చేయటానికి మరియు ఆవిడ అనారోగ్యం స్కేబిస్ వ్యాధితో మొదలైందని తెలుసుకున్న అబ్యాసకుడు ఆవిడకు ఒక psorinum miasm కోర్సు క్రింది విదంగా ఇవ్వాలని భావించారు:
#3. SR250 Psorinum 10M, 1M, 200C, 30C, 6C…single dose of each potency with an hour in between starting with the highest potency 10M.
మొదటి రకమైన పుల్ అవుట్ ఒక రోజు తరువాత మొదలైంది, అనగా అన్ని రోగ లక్షణాలు పెరిగాయి. రెండు రోజుల తరువాత ఆవిడకు ఉపశమనం కలిగింది. మూడు రోజుల తరువాత ఆవిడకు క్రిందివి ఇవ్వబడ్డాయి:
#4. SR294 Hepar Sulph Calc 10M, 1M, 200C, 30C, 6C… same procedure and dosage as before. రెండు రోజుల తరువాత ఆవిడకు క్రిందివి ఇవ్వబడ్డాయి:
#5. SR318 Thuja 10M, 1M, 200C, 30C, 6C… same procedure and dosage as before.
అయిదు రోజుల తరువాత ఆవిడకు చాలా బాగా ఉన్న అనుభూతి కలిగింది. దగ్గు దాదాపుగా పోయింది. గొంతు కూడా బాగా ఉండి మరియు సైనస్లు క్లియర్ గా ఉన్నాయి. ఊపిరి తిత్తుల నుంచి వచ్చే కఫం కూడా త్వరగా తగ్గి ఒక వారం తరువాత ఆవిడ దాదాపుగా 100% ఆరోగ్యంగా ఉంది.
సంపాదకుని వ్యాఖ్యానం:
ఒక మియాసం మరియు రెండు రేమేదిలను ఉపయోగించి దీర్గకాలిక ఆరోగ్య సమస్యలను కొత్త పద్ధతిలో నయం చేయటానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ.